బీజేపీలోకి భారత మాజీ క్రికెటర్!
భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామక్రిష్ణన్ బీజేపీ పార్టీలో చేరారు. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ శివరామక్రిష్ణన్ ఈరోజు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.;
భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామక్రిష్ణన్ బీజేపీ పార్టీలో చేరారు. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ శివరామక్రిష్ణన్ ఈరోజు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సీటీ రవి లక్ష్మణ్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వ కార్డును కూడా అందజేశారు. 1965, డిసెంబర్ 31న చెన్నైలో జన్మించిన లక్ష్మణ్ శివరామకృష్ణన్ చదువు అనంతరం క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. 16 సంవత్సరాల వయస్సులోనే తన తొలి ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. ఇక క్రికెట్ కి వీడ్కోలు పలికాక కామెంటేటర్‌గా, ఫీల్డ్ అంపైర్‌గా కొనసాగుతున్నారు. అయితే లక్ష్మణ్ బీజేపీ తీర్ధం పుచ్చుకోవడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అయన పోటి చేస్తారని తెలుస్తోంది.