తగ్గుతున్నాయనుకున్న బంగారం ధరలు కాస్తా బుధవారం మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లోనూ బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఎంసీఎక్స్ లో పది గ్రాముల బంగారం 110 రూపాయలు పెరిగి రూ.50,355లు పలుకగా, వెండి కిలో రూ.273 లు పెరిగి రూ.60,815 పలుకుతోంది.