Election Schedule: ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ రోజే..

Election Schedule: ఇవాళ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ పెడుతోంది.;

Update: 2022-10-14 08:54 GMT

Election Schedule: ఇవాళ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ పెడుతోంది. ఈ మీడియా సమావేశంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను ఎలక్షన్ కమిషన్ అధికారులు వెల్లడించనున్నారు.

ఎన్నికల నిర్వహణ కోసం రెండు రాష్ట్రాల్లో పర్యటించిన అధికారులు.. ఎలక్షన్ కమిషన్‌కు రిపోర్ట్ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 8వ తేదీతో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు ముగుస్తోంది. వచ్చే ఫిబ్రవరి 23తో గుజరాత్ అసెంబ్లీ గడువు ముగియనుంది.

ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే అధికారంలో ఉంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి ఆమ్‌ఆద్మీ పార్టీ గట్టి పోటీనిస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాని, కాంగ్రెస్‌ మాత్రం ఈ రెండు రాష్ట్రాల్లో వెనకబడి ఉంది. కాంగ్రెస్‌ ప్రచారంలో జోరు కనిపించడం లేదు. ఈ ఐదేళ్లలో కాంగ్రెస్‌ నుంచి కీలక నేతలు బీజేపీ, ఆమ్‌ఆద్మీ పార్టీల్లో చేరిపోయారు.

Tags:    

Similar News