Cross Gender Massage: క్రాస్ జెండర్ మసాజ్ సెంటర్లకు ప్రభుత్వం చెక్..
Cross Gender Massage: పైకి మసాజ్ సెంటర్.. కానీ లోపల జరుగుతోంది వ్యభిచారం. మసాజ్ సెంటర్ పేరుతో జరుగుతున్న అక్రమాలను నిర్మూలించేందుకు కఠిన ఉత్తర్వులు జారీ చేసింది;
Cross Gender Massage: పైకి మసాజ్ సెంటర్.. కానీ లోపల జరుగుతోంది వ్యభిచారం. మసాజ్ సెంటర్ పేరుతో జరుగుతున్న అక్రమాలను నిర్మూలించేందుకు కఠిన ఉత్తర్వులు జారీ చేసింది అసోం ప్రభుత్వం. రాష్ట్ర రాజధాని నగరమైన గౌహతిలో ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్పాలు, సెలూన్ సెంటర్లు, పార్లర్‌లలో క్రాస్ జెండర్ మసాజ్ జరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. మసాజ్ పేరుతో మహిళలపై జరుగుతున్న అక్రమాలను రూపుమాపేందుకు క్రాస్ జెండర్ మసాజ్‌పై నిషేధం విధించినట్లు గౌహతి మున్సిపల్ కమిషనర్ దేవాశిష్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త నిబంధనల ప్రకారం పార్లర్‌లు, స్పాలకు ప్రత్యేక గదులు ఉండకూడదు. వీటి ప్రధాన ద్వారాలకు గ్లాస్ డోర్స్ ఏర్పాటు చేయాలి. వ్యతిరేక లింగానికి చెందిన వారు మసాజ్ సేవలను అందించకూడదని ఉత్తర్వులో పేర్కొన్నారు. మసాజ్ పేరుతో లోపల జరుగుతున్న దురాగతలకు అడ్డుకట్ట వేయమని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ శర్మ చెప్పారు.