హత్రాస్ అత్యాచార ఘటనపై... విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ బాధితురాలు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు యూపీ బయలుదేరారు. ఈనేపథ్యంలో వారి పర్యటనకు అనుమతి లేదన్నారు పోలీసులు. వారి వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో... రాహుల్, ప్రియాంక కారు దిగి.. కాంగ్రెస్ నేతలతో కలిసి నడిచి వెళుతున్నారు.
రాహుల్, ప్రియాంకల పర్యటన నేపథ్యంలో.. ఢిల్లీ, యూపీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారంతా.. హత్రాస్ వెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితితులు ఉద్రిక్తంగా మారడంతో.. అక్కడ 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో.. హత్రాస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. యూపీలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై రాహుల్ మండిపడ్డారు. యూపీలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు.