Indian Army : హాట్సాఫ్ ఇండియన్ ఆర్మీ.. మీ సేవలకు సలాం..!
Indian Army : నైనిటాల్‌లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడానికి భారత సైన్యం సిబ్బంది చేతులు కలిపారు;
Uttarakhand: శత్రు దేశాల నుంచి దేశాన్ని రక్షించేందుకు బోర్డర్‌లో పగలూ రాత్రి పహారా కాస్తారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సైతం ఆర్మీ సైన్యం దేశ ప్రజలకు అండగా నిలబడుతుంది. తాజాగా ఉత్తరాఖండ్ నైనిటాల్‌లో భారీ వర్షాల కారణంగా రాష్ట్రం అతలాకుతలమవుతోంది.
నగర పౌరులు వరదల్లో చిక్కుకుని భీతావహులై నిలిచారు. ఆర్మీ బృందం అక్కడికి చేరుకుని వరదల్లో చిక్కుకున్న వారికి అండగా నిలిచింది. భారీ వర్షం కారణంగా షాపులో చిక్కుకున్న బృందాన్ని రక్షించడానికి భారత ఆర్మీ సిబ్బంది చేతులు కలిపారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న సిబ్బంది వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో, వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించడానికి ఆర్మీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ఆర్మీ సిబ్బంది చేయి చేయి కలిపి వారిని తమ భుజాల మీదకు తీసుకుని ఒకరి నుంచి ఒకరికి అందిస్తూ వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
వరదలో చిక్కుకున్న వారికి అండగా నిలబడి మీకేం భయంలేదు.. మేం మీతో ఉన్నాము.. అని ధైర్యంగా వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు పంపిస్తున్నారు. 24 గంటల పాటు కురిసిన భారీ వర్షాలు ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడి మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించాయి.
ఇండియన్ ఆర్మీ చేస్తున్న సేవలకు గాను నెటిజన్స్ నుంచి భారీ స్పందన వస్తోంది. నిజమైన హీరోలు మన ఇండియన్ ఆర్మీ అంటూ వారి సేవలకు సలాం చెబుతున్నారు.