6 దేశాలకు భారత వ్యాక్సిన్ల పంపిణీ!

దేశంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ చేపట్టిన ప్రభుత్వం 6 దేశాలకు ఈ వ్యాక్సిన్లు సరఫరా చేయనుంది. భూటాన్, నేపాల్, మాల్దీవులు, బంగ్లాదేశ్, మయన్మార్, సియాషెల్స్ దేశాలకు గ్రాంట్ కింద వ్యాక్సిన్ సరఫరా చేయనుంది.

Update: 2021-01-19 16:27 GMT

దేశంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ చేపట్టిన ప్రభుత్వం 6 దేశాలకు ఈ వ్యాక్సిన్లు సరఫరా చేయనుంది. భూటాన్, నేపాల్, మాల్దీవులు, బంగ్లాదేశ్, మయన్మార్, సియాషెల్స్ దేశాలకు గ్రాంట్ కింద వ్యాక్సిన్ సరఫరా చేయనుంది. అటు ఆఫ్గనిస్థాన్, శ్రీలంక, మారిషస్ ప్రభుత్వాల కన్ఫర్మేషన్ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. భారత్ తయారుచేసిన వ్యాక్సిన్లు సప్లయ్ చేయాలని పొరుగుదేశాలు మరియు భాగస్వామ్య దేశాల నుంచి భారత్ కు పలు అభ్యర్థనలు వచ్చాయని కేంద్ర విదేశీవ్యవహారాలవాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆరోగ్య అవసరాలు తీర్చడంలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఉండటం గౌరవకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Tags:    

Similar News