Omicron Death : భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు..!
Omicron Death : ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తోంది.. భారత్ లోనూ ఈ వేరియంట్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది.;
Omicron Death ; ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తోంది.. భారత్ లోనూ ఈ వేరియంట్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 1270 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా దేశంలో మొదటి ఒమిక్రాన్ మరణం నమోదయింది. మహారాష్ట్రకు చెందిన ఒమిక్రాన్ బాధితుడు(52) గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కాగా యశ్వంత్ రావు చవాన్ ఆసుపత్రిలో సదరు బాధితుడు కరోనాకు చికిత్స పొందుతూ ఈ నెల 28న మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించాడు. ముందుగా అతను గుండెపోటుతో చనిపోగా, ఆ తర్వాత ఒమిక్రాన్ పాజటివ్‌గా నిర్ధారణ అయినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. ఇక చనిపోయిన వ్యక్తికి ట్రావెల్ హిస్టరీ ఉందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా అతను గత 13 ఏళ్ల నుంచి డయాబెటిస్‌తో బాధపడుతున్నాడని పేర్కొన్నారు.