India Corona : దేశంలో కొత్తగా 2,200 కేసులు.. 2,550 రికవరీలు
India Corona : దేశంలో గడిచిన 24 గంటల్లో 2,202 కరోనా కేసులు నమోదయ్యాయి.. దీంతో కరోనా కేసుల సంఖ్య 4,31,23,801కి చేరుకుంది...;
India Corona : దేశంలో గడిచిన 24 గంటల్లో 2,202 కరోనా కేసులు నమోదయ్యాయి.. దీంతో కరోనా కేసుల సంఖ్య 4,31,23,801కి చేరుకుంది... నిన్నటితో పోలిస్తే 11.5% కేసులు తక్కువే. ఢిల్లీలో అత్యధికంగా 613 కొత్తగా కరోనా కేసులు నమోదు కాగా కేరళలో 428, హర్యానాలో 302, మహారాష్ట్రలో 255, ఉత్తరప్రదేశ్‌లో 153 కేసులు నమోదయ్యాయి.
అటు గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 27 మరణాలు నమోదయ్యాయి.. దీనితో మొత్తం మరణాల సంఖ్య 5,24,241 కు చేరుకుంది. ఇక 2,550 మంది కరోనా నుంచి కోలుకున్నారు, దీనితో దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,25,82,243కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలోరికవరీ రేటు 98.74% గా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.