India Corona : దేశంలో కొత్తగా 2,323 కరోనా కేసులు..!
India Corona : దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,323 కరోనా కేసులు నమోదయ్యాయి.;
India Corona : దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,323 కరోనా కేసులు నమోదయ్యాయి.. నిన్నటితో పోలిస్తే 2.8% కేసులు పెరిగాయి. కేరళలో అత్యధికంగా 556 కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 530, మహారాష్ట్రలో 311, హర్యానాలో 262, ఉత్తరప్రదేశ్ లో 146 కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,34,145కి చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో 25 మరణాలు నమోదయ్యాయి. దీనితో మరణాల సంఖ్య 5,24,348 కు చేరింది. అటు 2,346 మంది కరోనా నుంచి కోలుకున్నారు, దీంతో కోలుకున్న వారి సంఖ్య 4,25,94,801కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 14,996 యాక్టివ్ కేసులున్నాయి.