Tamilnadu: జల్లికట్టు జగడం.. మళ్లీ మొదలు
Tamilnadu: తమిళనాట మళ్లీ జల్లికట్టు జగడం రాజుకుంది. ఇటు పోలీసుల ఆంక్షలు.. అటు యువకుల దూకుడుతో రణరంగంగా మారింది.;
Tamilanadu: తమిళనాట మళ్లీ జల్లికట్టు జగడం రాజుకుంది. ఇటు పోలీసుల ఆంక్షలు.. అటు యువకుల దూకుడుతో రణరంగంగా మారింది. జల్లికట్టుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో యువకులు వీరంగం సృష్టించారు. దాంతో తమిళనాడు హోసూరులో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.
పోలీసులపై ఆందోళనకారులు రాళ్ల దాడి చేసారు. పలు పోలీస్ వాహనాలను, ప్రభుత్వ-ప్రైవేటు బస్సులను ధ్వంసం చేసారు. నిరసనకారులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. అటు ఆందోళనకారుల రాళ్ల దాడిలో 10 మందికి పైగా పోలీసులకు గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హోసూరులో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.