Danish Siddiqui : దివంగత జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీకి పులిట్జర్ అవార్డు..!

Danish Siddiqui : తాలిబన్ల కిరాతకానికి బలైపోయిన భారతీయ ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీని ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం వరించింది.

Update: 2022-05-10 12:30 GMT

Danish Siddiqui : తాలిబన్ల కిరాతకానికి బలైపోయిన భారతీయ ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీని ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం వరించింది. ఫీచర్​ ఫొటోగ్రఫీ కేటగిరీలో సిద్ధిఖీని ఈ అవార్డుకు ఎంపిక చేసింది పులిట్జర్ బోర్డ్. దేశంలో కరోనా విలయాన్ని కళ్లకుగట్టేలా ఫొటోలు తీసినందుకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు పేర్కొంది.

డానిష్ సిద్ధిఖీని పులిట్జర్​ పురస్కారం వరించడం ఇది రెండోసారి. 2018లో రోహింగ్యాల సంక్షోభాన్ని కవర్ చేసినందుకు ఈ అవార్డు దక్కింది. అటు 2021 జులైలో అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు, భద్రతా బలగాలకు మధ్య పోరును కవర్ చేసే క్రమంలో సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయారు.

అయితే సిద్దీఖి మరణం ఆకస్మికంగా జరిగింది కాదని అమెరికా పత్రిక​ ఓ కథనం ప్రచురించింది. కాగా ఇండియాలోని రాయిటర్స్ సంస్థలో చీఫ్ ఫోటోగ్రాఫర్‌గా పని చేసిన సిద్ధిఖీ.. ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశాడు. సిద్ధిఖీకి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.

Tags:    

Similar News