2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని సినీనటుడు, మక్కల్ నీది మయం వ్యవస్థాపకుడు కమల్ హసన్ విశ్వాసం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో గొంతు బలంగా వినిపిస్తానని అన్నారు. తమిళనాడులో మూడో అతిపెద్ద పార్టీగా మక్కల్ నీది మయం అవతరిస్తుందని.... థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నానని కమల్ తెలిపారు. తనను బీజేపీకి బీ-టీమ్ అనడం దారుణమని కమల్ చెప్పారు. రజనీకాంత్ పార్టీ పెట్టినా.. పెట్టకపోయినా మద్దతు కోరుతానని స్పష్టంచేశారు. ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చెప్పారు. డీఎంకేతో కూటమికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగడం లేదన్న కమల్.. నవంబర్‌లో తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తానని తెలిపారు.