వలలో చిక్కిన భారీ కొండచిలువ..
జాలర్లు చేపలు పడుతుండగా వలలో 15 అడుగుల కొండచిలువ;
కృష్ణా నదిలో వేటకు వెళ్లిన జాలరులకు చేపల బదులు భారీ కొండ చిలువ చిక్కింది. ఊహించని ఈ పరిణామానికి హతాశులైన జాలర్లు అధికారులకు విషయాన్ని తెలియజేశారు. తోట్ల వల్లూరు మండలం దేవరపల్లి వద్ద కృష్ణానదిలో జాలర్లు చేపలు పడుతుండగా వలలో 15 అడుగుల కొండచిలువ చిక్కింది. వలను బయటకు లాగిన తరువాత చూడగా చేపలతో పాటు భారీగా కొండచిలువ ప్రత్యక్షమైంది. మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా వారు దానిని పట్టుకుని అడవిలో వదిలేశారు.