Kerala : కేరళలో మారుతున్న రాజకీయ సాంప్రదాయం.. పినరయిని బెస్ట్ అనేసిన మలయాళీలు..!

కేరళలో రాజకీయ సాంప్రదాయం మారబోతోంది. ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే అలవాటు ఉన్న మలయాళీలు.. ఈసారి గత ప్రభుత్వాన్నే మళ్లీ గద్దె మీద కూర్చోబెడుతున్నారు.

Update: 2021-05-02 08:15 GMT

కేరళలో రాజకీయ సాంప్రదాయం మారబోతోంది. ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే అలవాటు ఉన్న మలయాళీలు.. ఈసారి గత ప్రభుత్వాన్నే మళ్లీ గద్దె మీద కూర్చోబెడుతున్నారు. పినరయి విజయన్‌ పాలన నచ్చిందంటూ తీర్పిచ్చారు కేరళ ఓటర్లు. గోల్డ్‌ స్కాం అంటూ విజయన్‌ను అబాసుపాలు చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆ పప్పులేమీ ఉడకలేదు. శబరిమల వివాదాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. కేరళలో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం అయిన బీజేపీ.. ఈసారి మూడు స్థానాల్లో ప్రభావం చూపుతోంది. కాంగ్రెస్‌ కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు 4 స్థానాలు ఎక్కువ సాధించబోతోంది. అయినప్పటికీ.. ఎల్‌డీఎఫ్ కూటమే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి 89 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.

Tags:    

Similar News