Lemon Prices : ఒక్కో నిమ్మకాయ రూ. 30 .. కిలో రూ. 400..!
Lemon Prices : రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువులు సామాన్యులకు షాక్ మీద షాకిస్తుంటే.. ఇప్పుడా లిస్టులోకి నిమ్మకాయలు కూడా చేరిపోయాయి.;
Lemon Prices: రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువులు సామాన్యులకు షాక్ మీద షాకిస్తుంటే.. ఇప్పుడా లిస్టులోకి నిమ్మకాయలు కూడా చేరిపోయాయి.. మార్కెట్లో నిమ్మకాయల ధరల చూస్తే నోటి మాట కూడా రాకుండా చేస్తున్నాయి. రాజస్థాన్‌లో కిలో నిమ్మకాయల ధర ఏకంగా రూ. 400 పలుకుతోంది. మంగళవారం జైపూర్‌లో కిలో నిమ్మ ధర రూ.340 ఉండగా, బుధవారం 24 గంటల్లో రూ.60 పెరిగింది. ఇక ఒక్కో నిమ్మకాయ అయితే ఏకంగా రూ. 30 పలుకుతుంది.
ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో నిమ్మసాగు చాలా తక్కువ దీనికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగడం తద్వారా రావణ చార్జీలు ఎక్కువ కావడం వలన వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి నిమ్మకాయలను దిగుమతి చేసుకోవడం తగ్గించారు. ఫలితంగా నిమ్మ ధర కొండెక్కి కూర్చుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కిలో నిమ్మకాయ మార్కెట్లో రూ. 200 పలుకుతుంది.
మార్చి, ఏప్రిల్ నెలలలోనే ఈ ధర ఉంటే.. మేలో మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదు. వేసవిలో సహజంగానే నిమ్మకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. డీహైడ్రేషన్ రాకుండా సమ్మర్‌లో ఎక్కువగా లెమన్ జ్యూస్ తాగేందుకు జనాలు ఇష్టపడుతుంటారు. ఇందులో విటమిన్సీ కూడా ఉంటుంది కాబాట్టి డిమాండ్ ఉండడం సహజమే.
కానీ ఊహించని రేట్లు మార్కెట్లో ఉండడంతో సామాన్యులు వామ్మో అంటున్నారు. గతంలో కిలో నిమ్మ రూ.50-60 పలకగా ఇప్పుడు ఏకంగా రూ.200లకు విక్రయిస్తున్నారు.