LPG Cylinder Price: మళ్లీ పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధర.. ఈసారి ఎంతంటే..

LPG Cylinder Price: గత రెండు నెలల వ్యవధిలో వంట గ్యాస్ ధరను పెంచడం ఇది నాలుగోసారి.

Update: 2021-10-06 07:08 GMT

LPG cylinder price : అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదలకు అనుగుణంగా, సబ్సిడీయేతర పెట్రోలియం గ్యాస్ (LPG) ధరలు అక్టోబర్ 6, బుధవారం రూ. 15 పెరిగింది. దేశరాజధానిలో ఒక నాన్ సబ్సిడీ 14.2 కిలోల సిలిండర్ ప్రస్తుత ధర రూ. 899,50 - నిన్నటి వరకు ఇదే సిలిండర్ ధర రూ. 884,50.

కాగా, గత రెండు నెలల వ్యవధిలో వంట గ్యాస్ ధరను పెంచడం ఇది నాలుగోసారి. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ, 15వ తేదీన గ్యాస్ ధరలను చమురు సంస్థలు సమీక్షిస్తాయి. అయితే అక్టోబరు ఒకటో తేదీన వాణిజ్య సిలిండర్ ధరలను పెంచగా.. కొంచెం ఆలస్యంగా వంట గ్యాస్ ధరలను సవరించాయి. 

Tags:    

Similar News