మహారాష్ట్రలోని పూణెలో చిరుత సంచరించింది. సోమవారం ఉదయం జనావాసాల మధ్య చిరుత ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పూణెలోని వార్జే ప్రాంతానికి సమీపంలోని న్యూ అహిరే గావ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు మూడు గంటల తర్వాత చిరుతను రెస్క్యూ చేసి పట్టుకున్నారు. చిరుతపులి ఓపెన్ గ్రౌండ్ సమాపంలోని టిన్ షెడ్ లో దాక్కున్నట్లు తెలిపారు.ప్రజలను ఇళ్లనుంచి బయటకు రావొద్దని అటవీశాఖ అధికారులు కోరారు. అయినప్పటికీ పెడచెవిన పెట్టిన ప్రజలు పులి ఉన్న ప్రాంతంలో కిక్కిరిసిపోయారు. అటవీశాఖ టీం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మూడుగంటలకుపైగా రెస్క్యూ చేసి చిరుతను రక్షించినట్లు అటవీశాఖ అధికారి రాహుల్ పాటిల్ దృవీకరించారు.