Mamata Banerjee : త్రిపురలో హింసాత్మక ఘటనలపై సీఎం మమతా బెనర్జీ సీరియస్

Mamata Banerjee : త్రిపురలో హింసాత్మక ఘటనలపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండపడ్డారు.

Update: 2021-11-23 13:45 GMT

Mamata Banerjee : త్రిపురలో హింసాత్మక ఘటనలపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండపడ్డారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, వేధింపులను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని దీదీ తెలిపారు. త్రిపురలో యువజన నేత సాయాని ఘోష్‌ అరెస్టు, పార్టీ కార్యకర్తలపై కొందరు దాడులు చేశారు. దీనిపై నిరసనగా టీఎంసీ ఎంపీలు ఢిల్లీలో టీఎంసీ ఎంపీలు, నేతలు ధర్నా చేపట్టారు. అయితే ఇతర కార్యక్రమాలు ఉండటంతో తాను ఆందోళనలో పాల్గొనలేదని మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర సమస్యలతో పాటు బీఎస్‌ఎఫ్‌ పరిధి పెంపు, త్రిపురలో హింసాత్మక ఘటనలను ప్రధానితో భేటీ సమయంలో చర్చిస్తానని మమత స్పష్టంచేశారు. మరోవైపు త్రిపురలో హింసాత్మక ఘటనలు, విపక్ష కార్యకర్తలపై పోలీసుల వేధింపులకు నిరసనగా ఢిల్లీలో టీఎంసీ ఆందోళన చేపట్టింది. అనంతరం కేంద్రం హోంమంత్రి అమిత్ షాను టీఎంసీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. త్రిపుర సీఎంతో ఫోన్‌లో మాట్లాడానని, నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా టీఎంసీ ఎంపీలకు భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News