Mangoes On EMI: మామిడిపళ్లు కూడా మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌లో..

Mangoes On EMI: ఎండాకాలంలో ఏసీలు, ఫ్రిడ్జ్‌లకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారే అంత మొత్తం పెట్టి కొనలేని వారు ఈఎమ్‌ఐ ద్వారా కొనుగోలు చేస్తుంటారు.;

Update: 2023-04-08 07:35 GMT

Mangoes on EMI: ఎండాకాలంలో ఏసీలు, ఫ్రిడ్జ్‌లకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారే అంత మొత్తం పెట్టి కొనలేని వారు ఈఎమ్‌ఐ ద్వారా కొనుగోలు చేస్తుంటారు. మరి సమ్మర్‌లో మాత్రమే దొరికే మామిడి పండ్లను మాత్రం వాయిదా పద్దతిలో ఎందుకు కొనుగోలు చేయకూడదు. అందుకే వినియోగదారులకు ఈ అవకాశాన్ని కలిపిస్తున్నారు పండ్ల ఉత్పత్తిదారులు. అల్ఫోన్సో మామిడి పండ్ల ధరలు కళ్లు చెదిరే విధంగా పెరగడంతో నగరంలోని ఓ వ్యాపారి మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పండ్లను అందిస్తున్నారు. దేవ్‌గఢ్ మరియు రత్నగిరికి చెందిన అల్ఫోన్సో మామిడి పండ్లకు అధిక గిరాకీ ఉంటుంది. రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి ఈ పండు తినాలనే కోరిక ఉన్న వారికి ఈఎమ్‌ఐ సౌకర్యం అందిస్తున్నారు పండ్ల వ్యాపారులు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో డజను అల్ఫోన్సో మామిడి పండ్లు రూ.800 నుండి 1300 వరకు విక్రయిస్తున్నారు. వ్యాపారి సనాస్ మాట్లాడుతూ.. దేశం మొత్తంలో EMIపై మామిడి పండ్లను విక్రయించడం తామే మొదట ప్రారంభించామని పేర్కొన్నారు.

"సీజన్ ప్రారంభంలో ధరలు ఎప్పుడూ చాలా ఎక్కువగా ఉంటాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు మరియు ఇతర ఉపకరణాలు EMI మీద కొనుగోలు చేస్తున్నప్పుడు, మామిడి పండ్లను మాత్రం ఎందుకు కొనుగోలు చేయకూడదు? ఇప్పుడు అందరూ మామిడి పండ్లను కొనుగోలు చేయవచ్చు," అని అతను చెప్పాడు. EMIలో అతని అవుట్‌లెట్‌లో పండ్లను కొనుగోలు చేయాలంటే కస్టమర్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించాలి. మొత్తం అమౌంట్‌ని మూడు, ఆరు లేదా 12 నెలలు EMI కట్టవచ్చు. కానీ ఈ విధంగా కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 5,000 సరుకు కొనాలి. ఇప్పటి వరకు నలుగురు వినియోగదారులు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని సనాస్ తెలిపారు.

Tags:    

Similar News