దేశంలో కొత్త రూపు దాల్చిన కరోనా.. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, ఏపీల్లోనే అధికం

మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, ఏపీల్లోనే ఈ కొత్త వేరియంట్లు అధికంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.

Update: 2021-03-24 13:30 GMT

దేశంలో కరోనా కొత్త రూపు దాల్చింది. కొత్త రకం కరోనా వేరియంట్లు 18 రాష్ట్రాల్లో గుర్తించినట్లు ప్రకటించింది కేంద్ర ఆరోగ్యశాఖ. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, ఏపీల్లోనే ఈ కొత్త వేరియంట్లు అధికంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ కొత్త కరోనా వేరియంట్లు రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకుంటున్నట్లు గుర్తించింది కేంద్రం. అయితే కరోనా విజృంభణ కారణం కొత్త డబుల్​ వేరియంట్లా కాదా అనేది చెప్పలేమంటోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో వైరస్‌ తీరుతెన్నులను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు పది జాతీయ పరిశోధనా కేంద్రాలతో కూడిన - ది ఇండియన్‌ సార్స్-కోవ్‌-2 కన్సార్టియం ఆన్‌ జినోమిక్స్‌ - INSACOG ను కేంద్ర ఆరోగ్యశాఖ గతేడాది ఏర్పాటు చేసింది. కొవిడ్‌-19 వైరస్‌లను విశ్లేషిస్తోన్న INSACOG, వాటి జినోమ్‌‌ సీక్వెన్సింగ్‌ను చేపడుతోంది.

దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుంచి 10,787 పాజిటివ్‌ శాంపిళ్లను విశ్లేషించింది. ఇందులో 771 కొత్త వేరియంట్లను కనుగొన్నట్లు వెల్లడించింది కేంద్రం. ఇందులోనూ 736 శాంపిళ్లలో బ్రిటన్ రకం కరోనా ఉందని నిర్ధారించారు. ఇంకో 34 శాంపిళ్లలో దక్షిణాఫ్రికా రకం, మరో శాంపిల్ లో బ్రెజిల్ రకం ఉన్నట్లు వెల్లడించింది. కేరళలోని 14 జిల్లాల నుంచి 2,032 శాంపిళ్లను పరిశీలించగా ఎన్440కే వేరియంట్ ఉన్నట్టు తేలిందని తెలిపింది. 11 జిల్లాల్లోని 123 శాంపిళ్లను పరిశీలించగా.. ఈ వేరియంట్ ఇమ్యూన్ సిస్టమ్ ను దాటుకుని మనగలిగిందని వెల్లడించింది. ఇంతకుముందు తెలంగాణలోని 104 శాంపిళ్లకుగానూ 53 శాంపిళ్లు, ఏపీలో 33 శాతం శాంపిళ్లలో ఈ వేరియంట్ ఉన్నట్లు వెల్లడించింది. మహారాష్ట్రలో గతేడాది డిసెంబరు కంటే ఇప్పటికి ఈ484క్యూ, ఎల్​452ఆర్​ మ్యూటెంట్ల వ్యాప్తి స్వల్పంగా పెరిగినట్లు తెల్పింది కేంద్రం.

ఒకటి,. రెండు కాదు.. ఏకంగా 771 రకాల కరోనా వైరసులు. ఇవన్నీ ఒక్క మన దేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 18 నాటికి దేశంలో 400గా ఉన్న ఈ కొత్త రకం కేసులు.. గడిచిన ఐదు రోజుల వ్యవధిలోనే సుమారు రెట్టింపయ్యాయి. ఒకవైపు దేశంలో కరోనా రెండోదఫా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ కొత్త రకాలు మరింత వ్యాప్తిచెందడం ఆందోళనకర విషయమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త రకాలకు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండడంతో ప్రజలు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలంటున్నారు వైద్యనిపుణులు.

Tags:    

Similar News