MP : రామ నవమి వేడుకల్లో అపశృతి.. ఫ్లోర్ కూలిపోయి బావిలో పడ్డ భక్తులు

Update: 2023-03-30 08:58 GMT

రామనవమి వేడుకలు జరుగుతుండగా ఆలయంలోని ఫ్లోర్ కుంగి పోయింది. భక్తులు ఫ్లోర్ పై నిలబడి అర్చనలో పాల్గొనగా ఈ ఘటన సంభవించింది. ఫ్లోర్ కింద బావి ఉండటంతో. భక్తులు భావిలో పడిపోయారు. ఈ ఘటన గురువారం ఉదయం మధ్యప్రదేశ్ లోని స్నేహ నగర్  శ్రీ బాలేశ్వర్ ఆలయంలో  చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 10మందిని రక్షించినట్లు తెలిపారు.  స్వల్పగాయాలతో భక్తులు బయటపడినట్లు తెలుస్తోంది.  బావిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు పోలీసులు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Similar News