నా మొబైల్ కూడా ట్యాప్ చేశారు-రాహుల్ గాంధీ
Rahul Gandhi:పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.;
Rahul Gandhi: పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ విచారణ జరిపించాలని.. హోంమంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పెగాసస్ వినియోగించారన్న రాహుల్.. ఈ వ్యవహారంలో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా స్పైవేర్ సాఫ్ట్‌వేర్ వాడారన్నారు. సీబీఐ డైరెక్టర్ ఫోన్‌ను ట్యాప్ చేశారని.. తన మొబైల్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు.
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పెగాసస్ వాడినట్లు ఇజ్రాయెల్ తెలిపిందని.. ఐతే.. మెదీ, అమిత్ షా దేశానికి వ్యతిరేకంగా పెగాసస్ వాడారన్నారు రాహుల్ గాంధీ. అంతకుముందు.. పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, శివసేన, డీఎంకే ఎంపీలు ధర్నా చేశారు.