దేశంలో కరోనా డేంజర్ బెల్స్..భారీగా పెరిగిన కేసులు..మరణాలు
Corona Cases in India: దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. క్రియాశీల కేసులు మళ్లీ 4 లక్షల మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది;
Corona Cases in India: దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. క్రియాశీల కేసులు మళ్లీ 4 లక్షల మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4 లక్షల 10వేల మంది కరోనాతో బాధపడుతున్నారు. పాజిటివిటీ రేటు కూడా 1.29 శాతానికి పెరిగింది. తాజాగా కరోనా నుంచి 36వేల 668 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 3 కోట్లు దాటగా.. రికవరీ రేటు 97.37 శాతంగా ఉంది. ఇక నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 62 లక్షల 53వేల మంది టీకా వేయించుకున్నారు. దీంతో పంపిణీ అయిన డోసుల సంఖ్య 48 కోట్ల మార్కును దాటింది. నిన్న 562 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,25,757 మంది మహమ్మారి బలి తీసుకుంది.