బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చే విమానాల రద్దు!
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి ప్రభుత్వం తాజాగా హెచ్చరికుల చేసింది. దీంతో ఐరోపా సహా ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి.;
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగు చూడటంతో భారత ప్రభుత్వం అలర్టైంది. ఆ దేశం నుంచి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఈ నెల 31వరకు బ్రిటన్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను రద్దు చేసింది. రేపు అర్ధరాత్రి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. యూకే నుంచి డిసెంబరు 22 అర్ధరాత్రిలోపు భారత్‌కు వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించింది.
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి ప్రభుత్వం తాజాగా హెచ్చరికుల చేసింది. దీంతో ఐరోపా సహా ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. పలు దేశాలు ఇప్పటికే బ్రిటన్‌కు విమాన సర్వీసులను నిలిపివేశాయి. అయితే కొత్త రకం వైరస్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని భారత ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈ వైరస్ పుట్టుక, వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సమావేశం నిర్వహించి చర్చించింది.