సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం..!

కాసేపట్లో భారత న్యాయవ్యవస్థ అత్యున్నత పీఠాన్ని తెలుగుతేజం అధిష్టించబోతోంది. 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Update: 2021-04-24 05:45 GMT

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ ఎన్వీ రమణతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, న్యాయమంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు, జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యులు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది అతిథులనే ఆహ్వానించారు. కాగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ.. వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు కొనసాగుతారు.

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ NV రమణ రికార్డు సృష్టించారు. గతంలో 1966-67 మధ్యకాలంలో జస్టిస్‌ కోకా సుబ్బారావు CJIగా పనిచేశారు. ఆయన తర్వాత రెండో తెలుగు వ్యక్తి ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన అనేక ముఖ్యమైన కేసుల్లో NV రమణ చారిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. ఇప్పుడు అత్యున్నత పదవిని అలంకరించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News