కోళ్ల ఫారంలో కోబ్రా..ధవళ వర్ణం నుంచి పసుపు వర్ణంలోకి..
అసలే నాగుపాము.. విషం చాలా పవర్‌ఫుల్.;
ఒడిశాలోని పిపిలో అయిదడుగుల నాగు పాము కోళ్ల ఫారమ్‌లో దర్శనమిచ్చింది. తెల్లగా ధవళ వర్ణంతో మెరిసి పోతున్న పామును చూసిన కోళ్లు అరుస్తుండడంతో యజమానికి ఏమైందో అని అనుమానం వచ్చింది. వెంటనే అక్కడకు చేరుకోగా పాము జర జరా పాకుతూ కనిపించకుండా దాక్కుంది. అసలే నాగుపాము.. విషం చాలా పవర్‌ఫుల్. కోళ్లను కరిచిందంటే ఇంకేమైనా ఉందా అని వెంటనే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేశారు. అతడు వచ్చి పామును పట్టుకున్పప్పుడు ధవళ వర్ణంలో ఉంది కాస్తా పసుపు వర్ణంలోకి మారిపోయింది. దాన్ని తేలిగ్గా పట్టుకున్నాడు. బండి డిక్కిలో వేసుకుని వెళ్లి దగ్గరలోని అడవిలో వదిలేశాడు. పాముని తీసుకెళ్లడంతో కోళ్ల ఫారం యజమాని ఊపిరిపీల్చుకున్నాడు.