Omicron India: భారత్‌లో 57కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య..
Omicron India: ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్.. దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది.;
Omicron India (tv5news.in)
Omicron India: ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్.. దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంగళవారం ఒక్కరోజే భారత్‌లో అత్యధికంగా 16 కేసులు వెలుగు చూశాయి. ఢిల్లీలో నాలుగు, రాజస్థాన్‌లో నాలుగు చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహరాష్ట్రలో ఎనిమిది కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 7 కేసులు ముంబైలో.. మరో కేసు వాసాయి విహార్ శివారులో నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
తాజా కేసులతో కలిపి మహరాష్ట్రలో కేసుల సంఖ్య 28కి చేరింది. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57 కి పెరిగింది. కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయిన ఎనిమిది మందిలో ఒకరు ఢిల్లీ.. మరోకరు బెంగళూరు ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఒక్క డోసు టీకా మాత్రమే తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో ముగ్గురికి ఎలాంటి లక్షణాలు కనబడకపోగా.. ఐదుగురిలో మాత్రం స్వల్ప లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వైరస్ సోకిన వారిలోఇద్దరు ఆస్పత్రిలో చేరగా.. ఆరుగురు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు నమైదన 28 కేసుల్లో అత్యధికంగా ముంబయిలో 12.. పింప్రీ చింద్వార్‌లో 10 కేసులు వెలుగుచూశాయి. పుణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2.. కళ్యాణ్ దొంబివలి, నాగ్‌పూర్, లాతూర్, వాసాయి విహార్‌లో ఒక్కొ కేసు చొప్పున నిర్ధారాణ అయ్యాయి.
ప్రస్తుతం 19 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. తొమ్మిది మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. టీకా పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. కేసులు సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని కోరింది