Omicron Variant: ఇండియాలోకి వచ్చేసిన ఒమిక్రాన్ వేరియంట్.. గోవాలో ఏడుగురికి..
Omicron Variant: ఒమిక్రాన్.. ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఈ వేరియంట్‌తో పెను ముప్పు తప్పదని WHO హెచ్చరించింది.;
Omicron Variant (tv5news.in)
Omicron Variant: ఒమిక్రాన్.. ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఈ వేరియంట్‌తో పెను ముప్పు తప్పదని WHO హెచ్చరించింది. ఇప్పటికే 8 దేశాల్లో ఇది బయటపడగా.. తాజాగా స్కాట్‌లాండ్, స్విట్జర్లాండ్‌తోపాటు మరికొన్ని చోట్లా కేసులు నమోదయ్యాయి. మొత్తం 13 దేశాల్లో ఇప్పుడీ ఒమిక్రాన్‌తో డేంజర్‌బెల్స్ మోగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వణుకు పుట్టిస్తోంది.
ఒమిక్రాన్‌తో ప్రపంచానికి పెను ముప్పు పొంచి ఉందన్న WHO హెచ్చరికలతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వేరియంట్ దేశంలోకి విస్తరించకుండా పటిష్ఠ చర్యలు చేపట్టింది. విదేశీయులు ఎవరైనా భారత్‌లోకి ప్రవేశించాలంటే 14 రోజుల ట్రావెల్ హిస్టరీతో పాటు RT-PCR టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్.. కచ్చితంగా ప్రయాణానికి ముందే సమర్పించాలని నిబంధనలు పెట్టింది.
అది కూడా ప్రయాణానికి 72 గంటల లోపు చేసిన పరీక్షల రిపోర్ట్‌లను మాత్రమే అంగీకరిస్తామని కేంద్ర వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు ఇచ్చింది. తగినన్ని పరీక్షలు నిర్వహించకపోతే.. వైరస్ వ్యాప్తి తీవ్రతను గుర్తించలేమని.. టెస్టింగ్‌కు సరిపడా సామగ్రిని సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. డిసెంబర్ 1 నుంచి స్కూళ్లు తెరవాలని భావిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఒమిక్రాన్ నేపథ్యంలో పకడ్బంధీగా చర్యలు తీసుకుంటోంది.
స్కూల్ టీచర్లు, సిబ్బంది.. వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలన్న ప్రభుత్వం.. పిల్లల మధ్య ఆరు అడుగుల దూరం, మాస్క్, హ్యాండ్ వాష్ తప్పనిసరి అని ఆదేశాలు ఇచ్చింది. అటు బోట్స్వానా నుంచి వచ్చిన మహిళ విషయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కంగారుపడుతోంది. ఆమె ఎక్కడ నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్లిందని అధికారులు ఉరుకులుపరుగులు పెట్టారు.
అయితే దీనిపై స్పందించిన బోట్స్వానా ఎంబసీ.. ఆమె జబల్‌పూర్‌లోని మిలటరీ ఆర్గనైజేషన్ ఐసోలేషన్‌లో ఉందని తెలిపింది. దీంతో ఆమె వివరాలు తీసుకున్న అధికారులు.. ఆమె ఎవరెవరిని కలిసింది అన్నదానిపై ఆరా తీస్తున్నారు. అటు గోవా జువైనల్ కేంద్రంలోని ఏడుగురు బాలురకు కోవిడ్ పాజిటివ్ రావడంతో గోవా సర్కార్ అప్రమత్తమైంది. ఇన్‌ఫెక్షన్‌కు గురైన బాలురను ప్రత్యేక వైద్య సిబ్బందితో పర్యవేక్షిస్తోంది.
స్కాట్‌లాండ్‌లో సౌతాఫ్రికా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఆరు నమోదు కావడంతో ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ ఆరుగురి రోగుల కాంటాక్ట్ ట్రాకింగ్ మొదలుపెట్టింది. అటు స్విట్జర్లాండ్‌లో కూడా తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. వారం క్రింతం సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా ఉన్నట్లు అధికారులు నిర్ధారించుకున్నారు.