Omicron Variant: ఇండియాలోకి అడుగుపెట్టిన ఒమిక్రాన్ వేరియంట్? బెంగుళూరులో ఇద్దరిలో ఆ లక్షణాలు..
Omicron Variant:కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తున్న వేళ సౌతాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్;
Omicron Variant: కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తున్న వేళ..సౌతాఫ్రికా నుంచి బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ తేలింది. ఐతే ఇది ఒమిక్రాన్ వేరియంటా..కాదా అనేది రిపోర్టులు వచ్చాకే నిర్ధారిస్తామన్నారు అధికారులు. టెస్టు రిజల్ట్స్ రావడానికి 48 గంటల టైం పడుతుందన్నారు. ప్రస్తుతం ఇద్దరిని క్వారంటైన్‌లో ఉంచినట్లు చెప్పారు.
మరోవైపు కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. మహారాష్ట్ర,కేరళ సరిహద్దుల్లో తనిఖీలు కఠినతరం చేయాలని సూచించారు. ఆ రెండు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి RT-PCR కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేయాలన్నారు. కేరళ నుంచి వచ్చిన విద్యార్థులందరికి RT-PCR టెస్టు నిర్వహించాలన్నారు.
హాస్టల్స్‌లో ఉండే స్టూడెంట్స్‌కు RT-PCR టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు. ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు విస్తృతం చేయాలన్నారు. నెగెటివ్ వచ్చిన వారినే బెంగళూరులోకి అనుమతించాలని చెప్పారు. బెంగళూరుకు సౌతాఫ్రికా నుంచి వెయ్యి మందికి పైగా వచ్చారన్నారు కర్ణాటక మినిస్టర్ అశోక. అందరికీ టెస్టులు చేశామన్నారు. పదిరోజుల్లో మరోసారి టెస్టు చేస్తామన్నారు.