ఆటోలో ఆక్సిజన్ సిలిండర్.. అందరికీ ఉచితంగా..

కొన్ని గంటల నిరీక్షణ తరువాత తల్లికి బెడ్ దొరికింది. కానీ ఈ లోపే ఆమె మరణించింది.

Update: 2021-05-27 11:47 GMT

అమ్మకి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రికి తీసుకు వస్తే బెడ్ లు ఖాళీ లేవని బయట కూర్చోబెట్టారు. అంతలోనే అమ్మ తల వాల్చేసింది. ఆరోజే అనుకున్నాను అమ్మలాంటి దుస్థితి మరొకరికి తలెత్త కూడదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అన్నారు 36 ఏళ్ల సీతాదేవి.

మే 1 న, 36 ఏళ్ల ఆర్ సీతాదేవి, రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (ఆర్‌జిజిజిహెచ్) వెలుపల వేచి ఉంది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన తన తల్లి పరిస్థితి క్షీణించిందని ఆస్పత్రిలో చేర్పించడానికని వచ్చారు. కొన్ని గంటల నిరీక్షణ తరువాత తల్లికి బెడ్ దొరికింది. కానీ ఈ లోపే ఆమె మరణించింది.

తన తల్లిలాగా ఇతరులు కష్టపడకుండా ఉండటానికి, శ్రీమతి సీతా దేవి ఇప్పుడు RGGGH వెలుపల ఆటోరిక్షా ఆక్సిజన్ సేవను ప్రారంభించింది.

"అప్పటికే డయాలసిస్ చేయించుకున్న నా తల్లికి సకాలంలో ఆక్సిజన్ అంది ఉంటే రక్షింపబడేది. అప్పటికే ఆర్‌జిజిజిహెచ్ వెలుపల చాలా మంది రోగులు ఉన్నారు. ఆసుపత్రిపై ఎక్కువ భారం పడింది.

అందువల్ల ఈ ఆక్సిజన్ ఆటో సేవను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను "అని స్ట్రీట్ విజన్ సోషల్ ఛారిటబుల్ ట్రస్ట్ అనే ఎన్జీఓను నిర్వహిస్తున్న సీతా దేవి వివరించారు. ఎన్జీవో సభ్యులు ట్రాన్స్‌జెండర్లు, హెచ్‌ఐవి బాధిత మహిళలు, పిల్లలకు సహాయం చేస్తారు, మురికివాడల్లోని పిల్లలకు ఉచిత ట్యూషన్‌ను అందిస్తారు.

ఎవరైనా వెంటనే ఆక్సిజన్ అవసరమైతే, నా వాలంటీర్లు, పిపిఇ కిట్లు ధరించి వాహనం లోపల కూర్చుని ఆక్సిజన్ అందించేలా చేస్తారని ఆమె వివరించారు.

ఆమె ఇప్పటి వరకు 300 మందికి సహాయం చేసింది. "ఇటీవల ఒక మహిళకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనతో ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రిలో బెడ్ దొరకలేదు. నేను ఆమెను ఆటోరిక్షాలో కూర్చోబెట్టి ఆక్సిజన్ అందించాను.

ఆమెకు ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడిన తరువాత, RGGGH లో ఒక ICU వార్డ్ ఇచ్చారు. ఆమె కుటుంబం నేను చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు తెలిపింది. ఆమె నా తల్లిని గుర్తు చేసింది, "అని సీత తెలిపారు.

ఇది కాకుండా, ఆమె RGGGH నుండి వైద్యులు సిఫార్సు చేసిన రోగులను ఇతర ఆసుపత్రులు మరియు COVID-19 సంరక్షణ కేంద్రాలకు కూడా తీసుకువెళుతుంది. శనివారం ఆక్సిజన్ ఆటో కారణంగా రక్షించబడిన కుంద్రతూర్‌కు చెందిన లింగరాజ్, సీతకు రుణపడి ఉన్నానని చెప్పారు.

నా ఆక్సిజన్ స్థాయిలు 72 కి పడిపోయాయి, కాని నన్ను ఆటోరిక్షాలో కూర్చోబెట్టి, నాకు ఆక్సిజన్ ఇచ్చారు ఆమె. దీంతో అది 92 కి పెరిగింది "అని ఆయన అన్నారు.

సీత ఇంతమందికి సహాయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. "నేను మరిన్ని ఆటో రిక్షాలను పొందాలని వాటిని ఆక్సిజన్‌తో అమర్చాలని ఆలోచిస్తున్నాను. కానీ నేను డబ్బు కోసం కష్టపడుతున్నాను, "అని ఆమె అన్నారు.

Tags:    

Similar News