అప్పట్నుంచి రైతుల ఖాతాల్లోకి రూ.2,000
దీనిని కేంద్ర ప్రభుత్వం రైతులకి మూడు విడతలుగా సహాయం చేస్తోంది. ఇప్పటివరకు ఏడు విడతలుగా నగదును రైతుల ఖాతాల్లో జమచేసింది.;
రైతులకి పెట్టుబడి సహాయంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. 6వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే.. దీనిని కేంద్ర ప్రభుత్వం రైతులకి మూడు విడతలుగా సహాయం చేస్తోంది. ఇప్పటివరకు ఏడు విడతలుగా నగదును రైతుల ఖాతాల్లో జమచేసింది. ఇప్పుడు ఎనమిదో విడత డబ్బులను ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్య దశలవారీగా రైతుల ఖాతాల్లోకి రూ. 2వేలు జయ చేయనుంది. ఇక రెండవ విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు కాగా మూడవ విడత డిసెంబర్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది. ఈ పథకంలో ఇప్పటి వరకు చేరని వారు మార్చి 31లోపు మీ పేరును పీఎం కిసాన్ అర్హుల జాబితాలో నమోదు చేసుకోవాలి.