Narendra modi : వ్యవసాయ రంగంలో కొత్త విప్లవం.. 100 'కిసాన్ డ్రోన్ల'ను ప్రారంభించిన ప్రధాని మోదీ
Narendra modi : రోజురోజుకు వ్యవసాయరంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరికొత్త టెక్నాలజీతో సాగులో కీలకమార్పునకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ.;
Narendra modi : రోజురోజుకు వ్యవసాయరంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరికొత్త టెక్నాలజీతో సాగులో కీలకమార్పునకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. పంట పొలాల్లో ఎరువులు చల్లడంతో పాటు... ఇతర వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులను మోసుకెళ్లేలా కిసాన్ డ్రోన్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 100 కిసాన్ డ్రోన్లను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
సాగులో డ్రోన్ల వాడకం రైతులకు 'ఓ వినూత్న, ఉత్తేజకర ఆరంభమని ప్రధాని మోదీ అభివర్ణించారు. కొన్నేళ్ల కిందటి వరకు డ్రోన్లు కేవలం రక్షణ రంగానికే పరిమితంకాగా..ప్రస్తుతం ఇతర రంగాలకు శాసించే స్థాయికి చేరుకుందన్నారు. దేశంలో ప్రస్తుతం 200లకు పైగా డ్రోన్ స్టార్టప్‌లు ఉండగా...త్వరలోనే వీటి సంఖ్య వెయ్యి దాటనున్నట్లు మోదీ తెలిపారు. అగ్రికల్చర్‌లో డ్రోన్ల వినియోగం ఆధునిక వ్యవసాయంలో కొత్త అధ్యాయమన్నారు.
ఇప్పటికే డ్రోన్లను ఔషధాలు, వ్యాక్సిన్ల రవణాకు ఉపయోగిస్తుండగా...కిసాన్ డ్రోన్లు కొత్త విప్లవానికి నాందిపలుకుతోంది. రాబోయో రోజుల్లో రైతులు తమ ఉత్పత్తులను తక్కువ సమయంలో మార్కెట్లకు చేరవేసేందుకు...డ్రోన్ల సాయం తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.