Narendra Modi : జిల్లాలో మీరు గెలిస్తే దేశం గెలిచినట్టే : ప్రధాని మోదీ
Narendra Modi : కరోనా కట్టడిపై ప్రధాని మోదీ క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు రాష్ట్రాలు, జిల్లాల అధికారులతో వర్చువల్ గా భేటీ అయ్యారు.;
Narendra Modi : కరోనా కట్టడిపై ప్రధాని మోదీ క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు రాష్ట్రాలు, జిల్లాల అధికారులతో వర్చువల్ గా భేటీ అయ్యారు. కరోనా పోరులో అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారని, వారి కృషి అభినందనీయమని కొనియాడారు. జిల్లాల్లో పరిస్థితులు అధికారులకే బాగా తెలుసన్న మోదీ, కరోనాపై జిల్లాల్లో గెలిస్తే దేశం గెలిచినట్లేనని చెప్పారు. ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడడమే మన ధ్యేయంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో కరోనా కట్టడి ప్రణాళికలను ప్రధాని మోదీతో అధికారులు పంచుకున్నారు.