President in Yadadri: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి

President in Yadadri: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు.

Update: 2022-12-30 07:00 GMT

President in Yadadri: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన రాష్ట్రపతికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనాన్ని కల్పించారు. స్వామివారిని దర్శించుకున్న ముర్ము.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.


రాష్ట్రపతి రాక సందర్భంగా కొండపై భక్తుల వాహనాలకు అనుమతించడం లేదు. ఇప్పటి వరకు నలుగురు రాష్ట్రపతులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఇప్పుడు ద్రౌపది ముర్ము ఐదో రాష్ట్రపతిగా నిలిచారు. ఇక వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ చరిత్ర కళ్లకు కనిపించేలా... దేవస్థానం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రధానాలయ మాఢవీధులోని అద్దాల మండపం వద్ద ఏర్పాటు చేశారు. ఆలయ చరిత్రను రాష్ట్రపతికి వివరించనున్నారు.. ఆలయ అధికారులు.


యాదాద్రి పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్‌కు పయనం కానున్నారు.. రాష్ట్రపతి ముర్ము. మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, మిలటరీ వారికి విందు ఇవ్వనున్నారు. ఇక ఐదు రోజుల పర్యటన ముగియడంతో సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి ముర్ము ఢిల్లీకి వెళ్లనున్నారు.

Tags:    

Similar News