నిలకడగా రామ్‌నాథ్‌ కోవింద్ ఆరోగ్యం..!

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Update: 2021-03-28 05:45 GMT

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై శనివారం ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌​ విడుదల చేసింది. సాధారణ వైద్య పరీక్షల అనంతరం రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ను ఢిల్లీలోని ఏయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బైపాస్‌ సర్జరీ నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 30న ఏయిమ్స్ ఆసుపత్రిలో‌ ఆయనకు బైపాస్‌ సర్జరీ చేయనున్నారు.

శుక్రవారం రామ్‌నాథ్‌ కోవింద్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో​ ఆయనను వెంటనే ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని కోరిన వారందరికీ కృతజ్ఙతలు తెలియజేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..అటు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రపతి కుమారుడితో ఫోనులో మాట్లాడారు.

Tags:    

Similar News