Narendra Modi : కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం : మోదీ
Narendra Modi : కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు.;
Narendra Modi : కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పటివరకు 18 కోట్ల టీకా డోసులు ఇచ్చామని.. పౌరులందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మోదీ తెలిపారు. అటు దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే 20 వేల వరకు తగ్గాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,75,515 టెస్టులు చేస్తే 3,43,144 మందికి పాజిటివ్ వచ్చింది. 4 వేల మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 2,40,46,809కి చేరగా మరణాల సంఖ్య 2,62,317గా ఉంది. గత 24 గంటల్లో 3,44,776 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 37,04,893 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ చెప్పింది