Narendra Modi Addresses Rajya Sabha : రైతుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: మోదీ
Narendra Modi Addresses Rajya Sabha : రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టి కొత్త సాగు చట్టాలు తీసుకొచ్చామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు.
Narendra Modi Addresses Rajya Sabha : రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టి కొత్త సాగు చట్టాలు తీసుకొచ్చామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. గతంలో సంస్కరణలకు అనుకూలంగా ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు కావాలనే చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని దుయ్యబట్టారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ రాజ్యసభలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు నిలిచిపోయాయని తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. చిన్న, సన్నకారు రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చినట్టు వివరించారు.
రైతుల ఆందోళనపై అంతర్జాతీయ స్పందనలు, సోషల్ మీడియాలో దుష్ప్రచారాల గురించి కూడా మోదీ పరోక్షంగా స్పందించారు. నూతన విదేశీ విధ్వంసక సిద్ధాంతాలు పుట్టుకొస్తున్నాయని, వాటి పట్ల దేశం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.