Priyanka Gandhi: యూపీ పోలీసుల అదుపులో ప్రియాంక గాంధీ..
Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్ ఘటనలో మరణించిన బాధిత కుటుంబాల వద్దకు వెళ్లిన ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు.;
Priyanka Gandhi (tv5news.in)
Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి వెళ్లిన అడ్డుకుంటారా అని ఆమె అధికారులన నిలదీసింది. ఈతరణంలో ఓ అధికారి స్పందిస్తూ.. శాంతి భద్రతల దృష్ట్యా ప్రియాంక పర్యటనకు అనుమతులు లేని కారణంగా అడ్డుకున్నట్లు స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు, యూపీ పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ప్రియాంకగాంధీని స్థానిక పీఎస్ తరలించారు
యూపీలో ప్రియాంక గాంధీని అడ్డుకున్న పోలీసులు
లఖింపూర్ ఘటనలో మరణించిన కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంక
శాంతి భద్రతల దృష్ట్యా ,అనుమతులు లేని కారణంగా ప్రియాంక గాంధీ ని అడ్డుకున్నామన్న పోలీసులు
పోలీసులు తీరుపై మండిపడిన ప్రియాంక గాంధీ