PT Usha Rajyasabha: రాజ్యసభలోకి పరుగుల రాణి..

PT Usha as Rajyasabha MP: పరుగుల రాణిగా పీటీ ఉషకు పేరుంది. తాజాగా పీటీ ఉష రాజ్యసభకు నామినేట్ అయింది.

Update: 2022-07-06 16:22 GMT

‌PT Usha as Rajyasabha MP: పరుగుల రాణిగా పీటీ ఉషకు పేరుంది. వేగంగా పరిగెత్తేది దేశంలో చిరుత మొదటిదైతే రెండవ స్థానం పీటీ ఉషదే. పీటీ ఉష పూర్తి పేరు పిలవుల్లకండి తెక్కెపరంబిల్ ఉష.1979 నుంచి అంతర్జాతీయ అథ్లెట్ రంగంలో ఆమె పేరు వినిపిస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం పీటీ ఉషను రాజ్యసభకు నామినేట్ చేసిన సందర్భంగా పరుగుల రాణి గురించిన మరిన్ని విశేషాలు..

1964 జూన్ 27న కేరళలోని కుట్టలిలో ఆమె జన్మించింది. చిన్న తనంలోనే ఆమె పరుగు చూసి గోల్డెన్ గర్ల్, పయ్యోలి ఎక్స్‌ప్రెస్ అని ముద్దుగా పిలిచేవారు.1978లో పీటీ ఉష మొదటి సారి రన్నింగ్ ట్రాక్ లో అడుగుపెట్టింది. నేషనల్ ఇంటర్ స్టేట్ మీట్ పోటీలో మంచి ప్రతిభ కనబరిచింది. 1986 నుంచి 1994 వరకు ఏషియన్ గేమ్స్ లో భారత్ తరపున 4 గోల్డ్ మెడల్స్, 6 సిల్వర్ మెడల్స్ గెలుచుకుంది.

పీటీ ఉష గెలుచుకున్న మెడల్స్ కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. గెలుచుకున్న అన్ని మెడల్స్ అంతర్జాతీయ పోటీలోనివే. 1985లో జకార్త ఏషియన్ అత్లెట్ మీట్ లో 5 గోల్డ్ మెడల్స్ ఒక బ్రాన్జ్ గెలుచుకుంది.ఎక్కువ సంఖ్యలో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న ఫీమేల్ అథ్లెట్‌గా కూడా పీటీ ఉష రికార్డు నెలకొల్పింది.

ప్రస్తుతం పీటీ ఉష కేరళలోని తన ట్రైనింగ్ అకాడమీలో యువ అథ్లెట్లకు శిక్షణనివ్వడంతో పాటు రైల్వే ఉద్యోగిగా సేవలందిస్తోంది. తాజాగా పీటీ ఉష రాజ్యసభకు నామినేట్ కావడంతో ప్రధాని ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... పీటీ ఉష ప్రతీ భారతీయుడికీ స్పూర్తి అన్నారు.

Tags:    

Similar News