విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ స్తంభించింది. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా విపక్షాలు ధర్నా చేపట్టాయి. నలుపు బట్టలు ధరించి పార్లమెంట్‌లోనే నిరసన తెలిపాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉభయసభల్లో నినాదాలు చేసాయి. సేవ్ డెమోక్రసీ, డెమోక్రసీ ఇన్ డేంజర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసాయి. విపక్ష పార్టీల నిరసన హోరుతో గందరగోళం నెలకొనగా.. పార్లమెంట్ ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.