Rahul Gandhi : అందుకే అమరీందర్‌‌సింగ్ ని సీఎం పదవి నుంచి తప్పించాం : రాహుల్ గాంధీ

Rahul Gandhi : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-02-18 01:45 GMT

Rahul Gandhi : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.. పంజాబ్‌లోని ఫతేగర్ సాహిబ్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పేదలకు ఉచిత విద్యుత్ అందించేందుకు నిరాకరించడంతో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను సీఎం పదవి నుండి తొలగించామని అన్నారు. ఇది పార్టీ అంతర్గతం వ్యవహారం కానీ చెబుతున్నానని అన్నారు.

రాష్ట్రంలో పేదలకి ఉచిత కరెంట్ ఇవ్వాలని అమరీందర్ సింగ్‌ కి చెప్పానని, కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదని అన్నారు. పవర్ కంపెనీలతో తనకి కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పారు. అందుకే ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాల్సి వచ్చిందని రాహుల్ తెలిపారు. ఇక అమరీందర్ సింగ్ స్థానంలో చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్ ఆ తర్వాత పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను స్థాపించారు, బీజేపీతో కలిసి ఆయన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 20న ఒకే దశలో పోలింగ్ జరుగనుంది.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Tags:    

Similar News