Rahul Gandhi : రైతుల సత్యాగ్రహం ప్రధాని మోడీ అహంకారాన్ని ఓడించింది..!
Rahul Gandhi : ప్రధాని మోడీ ప్రకటనపై స్పందించారు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. రైతుల సత్యాగ్రహం ప్రధాని మోడీ అహంకారాన్ని ఓడించిందన్నారు.;
Rahul Gandhi : ప్రధాని మోడీ ప్రకటనపై స్పందించారు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. రైతుల సత్యాగ్రహం ప్రధాని మోడీ అహంకారాన్ని ఓడించిందన్నారు. కొత్త అగ్రిచట్టాలు వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతించారు పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధు. కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందన్నారు. ఇది రైతుల ఆందోళనలకు దక్కిన విజయమన్నారు. పంజాబ్ లో వ్యవసాయ పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యమిస్తామంటూ ట్వీట్ చేశారు. నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పారు పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్.
ఇక నల్ల వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కు తగ్గడం ముమ్మాటికీ దేశ రైతాంగ విజయమన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. దేశానికి వెన్నెముకైన రైతు కన్నెర్రజేస్తే ఎంతటి నియంతైనా దిగిరాక తప్పదు అనడానికి ఇదే నిదర్శనమన్నారు. రైతాంగ పోరాట చరిత్రలో ఇదొక చారిత్రక విజయమన్నారు. ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతుల సంకల్పం ముందు అవి తునాతునకలయ్యాయన్నారు.
కేంద్రం ముందే కళ్లు తెరిచి ఉంటే ఉద్యమంలో వందల మంది రైతుల ప్రాణాలు పోయేవి కావన్నారు. దేశంలో ఇతర ప్రజా సమస్యలపై పోరాటానికి రైతు ఉద్యమం స్ఫూర్తినిచ్చిందన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ కూడా దిగిరాక తప్పదన్నారు. ప్రతి గింజా కొనే వరకు వదలబోమన్నారు రేవంత్‌రెడ్డి.