చెన్నై మహానగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు

Update: 2020-10-30 01:25 GMT

భారీ వర్షాలు చెన్నై మహానగరాన్ని ముంచెత్తాయి. గత కొద్దిరో్జులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. వేలాది ఇళ్లలోకి వరద నీరుచేరింది. గాలుల కారణంగా చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి. చాలా చోట్ల ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులకుగురవుతున్నారు. వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. గతంలో వచ్చిన వరదల్లాగానే ఈ వర్షాలు నగరాన్ని మరోసారి ముంచెత్తుతాయేమోనని జనం ఆందోళన చెందుతున్నారు.

నగరంలో భారీ వర్షాల కారణంగా చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచిపోయింది. పెద్దపెద్దచెట్లు రోడ్లపై పడిపోయాయి. దీంతో చాలా చోట్లనుంచి ఫిర్యాదులు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నమ్మ చెన్నై' యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కోరింది. అలాగే ప్రజల సహాయార్థం హెల్ప్‌లైన్‌ నంబర్లను కూడా అందుబాటులో తీసుకొచ్చింది.

అయితే రాబోయే 24 గంటల్లో తమిళనాడులోని 8 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. రాష్ట్రమంతటా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నందున భారత వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీచేసింది. తమిళనాడు, పుదుచ్చేరిలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రాకూడదని తెలిపింది.

Tags:    

Similar News