రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం

Rajiv Khel Ratna Award: దేశంలో క్రీడాకారులకు అందించే రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2021-08-06 08:17 GMT

Rajiv Khel Ratna Award: దేశంలో క్రీడాకారులకు అందించే రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అవార్డు పేరును మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నగా మార్చారు. భారత హాకీ జట్టు దిగ్గజ ఆటగాడు ధ్యాన్‌చంద్‌ పేరు పెట్టడం విశేషం. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌లో ప్రకటించారు. దేశ ప్రజలందరి నుంచి వచ్చిన విజ్ఞప్తులతో వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

1991-92లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పేరుగా మీదుగా ఖేల్‌రత్న అవార్డు ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం క్రీడాకారులకు అవార్డులు ప్రకటిస్తున్నారు. ధ్యాన్‌చంద్‌ కెప్టెన్సీలో హకీ జట్టు మూడుసార్లు వరుసగా ఒలింపిక్స్‌ స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. తాజాగా టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో మళ్లీ భారత హాకీ జట్టు పతకం పొందింది. మహిళల జట్టు సెమీ ఫైనల్‌ పోరాట పటిమను కనబరించింది. 

Tags:    

Similar News