Uttarakhand: ఉత్తరాఖండ్ వరద బీభత్సం..107 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షపాతం..
Uttarakhand: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలకు ఇప్పటి వరకు 65 మంది చనిపోయారు.;
Uttarakhand: ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలకు ఇప్పటి వరకు 65 మంది చనిపోయారు. ముక్తేశ్వర్‌లో 107 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షపాతం నమోదైంది. వెస్ట్రన్ డిస్టబెన్సెస్ కారణంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇప్పటికే చాలా మంది గల్లంతయ్యారు. అలా గల్లంతైన వారు శవాలుగా తేలుతున్నారు. ఒక్క నైనిటాల్‌లోనే 34 మంది చనిపోయారు. అటు చంపావత్ జిల్లాలోనూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన 11 మందిలో ఐదుగురు చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు.