కరోనా రోగులకు ఇచ్చే రెమిడెసివిర్ ధర తగ్గింపు..!
కాడిలా హెల్త్‌కేర్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా లాంటి సంస్థలు రెమిడెసివిర్ బ్రాండ్లపై ధరలు తగ్గించినవాటిలో ఉన్నాయి. ధర తగ్గింపు నిర్ణయాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ స్వాగతించారు.;
కరోనా రోగులకు ఇచ్చే ప్రధాన ఔషధం రెమిడెసివిర్ ధర తగ్గించాయి దేశీయ ఫార్మా కంపెనీలు. ధరలు సామాన్యప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ కేంద్రం విజ్ఞప్తి చేనేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్పీపీఏ ప్రకటించింది.ఈ ఔషధం ధర తగ్గించాలని కేంద్రం అనేక సార్లు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలోఈ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ ప్రకటించింది.
కాడిలా హెల్త్‌కేర్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా లాంటి సంస్థలు రెమిడెసివిర్ బ్రాండ్లపై ధరలు తగ్గించినవాటిలో ఉన్నాయి. ధర తగ్గింపు నిర్ణయాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ స్వాగతించారు. కరోనాపై పోరులో ఫార్మా కంపెనీలు కలిసి వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. రెమ్ డాక్ బ్రాండ్ ధర రూ.2,800 నుంచి రూ.899కి తగ్గించగా, రెమ్ విన్ బ్రాండ్ రూ.3,950 నుంచి రూ.2,450కి తగ్గించారు.
రెడిక్స్ బ్రాండ్ ధర రూ.5,400 నుంచి రూ.2,700కి తగ్గింది. సిప్ రెమీ బ్రాండ్ ధర రూ.4 వేల నుంచి రూ.3 వేలకు... డెస్ రెమ్ బ్రాండ్ ధర రూ.4,800 నుంచి రూ.3,400కి తగ్గింది. ఇక జుబీ-ఆర్ బ్రాండ్ ధర రూ.4,700 నుంచి రూ.3,400కి... కోవిఫర్ బ్రాండ్ ధర రూ.5,400 నుంచి రూ.3,490కి తగ్గించారు.