Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు.;
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. బేతుల్ జిల్లా ఝల్లార్ వద్ద ప్రైవేట్ బస్సు, కారు ఢీకొన్నాయి. స్పాట్‌లోనే కారులో ఉన్న 11 మంది చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి.
మృతులంతా మహారాష్ట్రలోని అమరావతి జిల్లా కల్మట్టలో పనిచేస్తున్న కార్మికులుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.