Uttar Pradesh : వ్యాపారి ఇంట్లో రూ.150 కోట్ల బ్లాక్ మనీ .. నిన్నటి నుంచి కొనసాగుతున్న లెక్కింపు

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌కు చెందిన పీయూష్‌ జైన్ అనే సుగంధ ద్రవ్యాల వ్యాపారి జీఎస్టీ మోసాన్ని బట్టబయలు చేశారు ఐటీ అధికారులు.

Update: 2021-12-24 11:45 GMT

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌కు చెందిన పీయూష్‌ జైన్ అనే సుగంధ ద్రవ్యాల వ్యాపారి జీఎస్టీ మోసాన్ని బట్టబయలు చేశారు ఐటీ అధికారులు. నకిలీ ఇన్‌-వాయిస్‌లు, ఈ-వే బిల్లుల ద్వారా పన్ను ఎగవేసి కూడాబెట్టిన దాదాపు 150 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కాన్పూర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు....బీరువాల్లో కట్టలు,కట్టలుగా బయటపడ్డ నోట్లను చూసి ఆశ్చర్యపోయారు. గురువారం ఉదయం దాడులు నిర్వహించిన అధికారులు....ఇవాళ ఉదయం వరకు లెక్కించి డబ్బు విలువ 150 కోట్ల రూపాయలుగా తేల్చారు. పీయూష్‌ జైన్ ఇంట్లో మూడు నోట్ల లెక్కింపు మెషిన్లను కూడా అధికారులు గుర్తించారు. రెండు బీరువాల నిండా డబ్బును గుర్తించిన అధికారులు..వాటిని కుప్పలుగా పోసి లెక్కించారు. ఆ నోట్లను తరలించేందుకు పదుల సంఖ్యలో బాక్సులు తీసుకువచ్చారు. ఈ కేసుకు సంబంధించి కాన్పూర్ సహా యూపీలోని పలు ప్రాంతాలు, గుజరాత్‌, ముంబైల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు.

Tags:    

Similar News