Omicron cases : కరోనా ఎఫెక్ట్ : 1 నుంచి 9 తరగతి విద్యార్ధులకి క్లాసులు బంద్..!

Omicron cases : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. భారత్ లో కూడా క్రమంగా ఈ వేరియంట్ విజృంభిస్తోంది.

Update: 2022-01-03 13:07 GMT

Omicron cases : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. భారత్ లో కూడా క్రమంగా ఈ వేరియంట్ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో, ఢిల్లీలో కేసులు వీపరితంగా పెరుగుతున్నాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు మొదలుపెట్టాయి. అందులో భాగంగానే 1 నుంచి 9 వ తరగతి విద్యార్ధులకి ఈ నెల 31 వరకు తరగతులు నిలిపివేస్తున్నట్లుగా బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సోమవారం తెలిపింది. ఇక 10-12 తరగతి విద్యార్ధులకి తరగతులు కొనసాగుతాయని చెప్పుకొచ్చింది. ఇక మహారాష్ట్రలో ఆదివారం రోజున కొత్తగా 11,877 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ముందు రోజు కంటే 2,707 ఎక్కువ, ఇక 50 ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. అటు తొమ్మిది మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 42,024 యాక్టివ్ కేసులున్నాయి. 

Tags:    

Similar News